పవన్ టైటిల్ అప్పుడే ప్రకటిస్తారట ?

Wednesday, October 25th, 2017, 10:25:45 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ విషయంలో ఇంతగా ఎందుకు దాస్తున్నారో అర్థం కాకుండా ఉంది. సినిమా మొదలై చాలా రోజులే అవుతున్నా కూడా ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు సూపర్ హిట్స్ తరువాత పవన్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ ఫిక్స్ అయ్యారు ఫాన్స్ ? ఇంకా అధికారికంగా యూనిట్ ఖరారు చేయలేదు. ఈ దీపావళికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని ఆశపడ్డారు కానీ అది కుదరలేదు .. సో త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ విడుదల చేసే సమయం వచ్చేసింది. అవును నవంబర్ 7న ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారట !! ఆ రోజు ప్రత్యేకత ఏమిటో అర్థం కావడం లేదా .. దర్శకుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్బంగా టైటిల్ విడుదల చేయాలనీ ప్లాన్ చేసాడట పవన్. మరి పవన్ సినిమాకు టైటిల్ ఏమి పెడతారా అన్నది ఆసక్తి రేపుతోంది. అను ఇమ్మానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేస్తారట !!

  •  
  •  
  •  
  •  

Comments