ప్రభాస్… ఐడియా అదిరిందిగా ?

Tuesday, February 28th, 2017, 10:17:16 PM IST


బాహుబలి తో అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2 సినిమా విడుదల సన్నాహాల్లో జోరుగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇక ప్రభాస్ నెక్స్ట్ సినిమా కూడా మొదలు పెట్టేసాడు. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న సుజీత్ తో ప్రభాస్ చేసే సినిమా మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమా టీజర్ ని ముందే విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి2 సినిమా తో పాటు ఈ టీజర్ విడుదలైతే ప్రభాస్ నెక్స్ట్ సినిమాకు కూడా మంచి మార్కెట్ దక్కే అవకాశం ఉంది కాబట్టి .. ఈ ప్లాన్ వేసారట !! అందుకే బాహుబలి విడుదలకు ఇంకా నెల సమయం ఉంది కాబట్టి ఈ లోగా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు తీసి దాన్ని టీజర్ గా కట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు? నిజంగా ఇది మంచి కాష్ చేసుకునే ఐడియా నే కదా ఏమంటారు ?