బుల్లితెర మెగాస్టార్ మళ్ళీ వస్తున్నాడు ..

Thursday, February 16th, 2017, 01:31:53 PM IST


యాంకర్ మరియూ హోస్ట్ గా అందరికీ సుపరిచితం అయిన ప్రభాకర్ కొన్ని సంవత్సరాల తరవాత ఎవ్వరికీ కనిపించకుండా పోయాడు. బుల్లితెర మెగాస్టార్ అనే పేరు సంపాదించుకున్న ప్రభాకర్ ఈటీవీ ని తన ఇంటిపేరుగా కూడా మర్చేసుకున్నాడు. ఒక టైం లో ఈటీవీ లో టెలీకాస్ట్ అయిన ప్రతీ ప్రోగ్రాం వెనకాలా ఇతనే ఉండేవాడు. ఆ తర్వాత మెల్లగా సీరియల్స్ లో యాక్టింగ్ ప్రారంభించిన ప్రభాకర్.. కొన్నేళ్ల నుంచి దాదాపు ఇండస్ట్రీకి దూరమైపోయాడు.దూరంగా ఉన్నా కానీ.. దూరమైపోలేదు అంటూ.. ఇప్పుడు మళ్లీ స్ట్రాంగ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట ప్రభాకర్. ఓ మాంచి మూవీతో డైరెక్టర్ గా రీఎంట్రీ ఇవ్వాలన్నది ప్రభాకర్ టార్గెట్ గా తెలుస్తోంది. నిజానికి తన కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయాలని భావించాడట. అల్లు శిరీష్ హీరోగా ఓ మూవీ చేసేందుకు ఫిక్స్ అయినా.. ప్రస్తుతం శిరీష్ డైరీ ఫుల్ అయిపోవడంతో.. చాలా కాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.