ప్రభాస్ ఇమేజ్ తో మహానుభావుడు సేఫ్ అవుతాడా?

Monday, September 25th, 2017, 05:59:06 PM IST


యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్నా సినిమా మహానుభావుడు. ఈ సినిమా ఎ నెల 29న ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మారుతి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు దసరా రేస్ లో జై లవకుశ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తో రన్ అవుతుంది. మరో రెండు రోజుల్లో సూపర్ స్టార్ మహేశ్ సినిమా స్పైడర్ ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ రెండు పెద్ద సినిమాల మధ్య మహానుభావుడు సినిమాని రిలీజ్ చేయాలని మారుతి అనుకోవడం చాలా సాహసోపేత నిర్ణయం అని అందరు అంటున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరు జై లవకుశ, స్పైడర్ ఫీవర్ లో ఉన్నారు. కనీసం మహానుభావుడు సినిమా గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. సినిమా ట్రైలర్ మీద పోజిటివ్ టాక్ తెచ్చుకున్న, మహానుభావుడు సినిమా మీద బజ్ లేదు.

అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ సడెన్ గా ఆదివారం ఫంక్షన్ నిర్వహించారు. శర్వానంద్ బ్యాడ్ లక్ ఏంటో గాని. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతున్న విషయం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు .దీనికి కారణం ఆదివారం ఇండియా- ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ తో పాటు, మరో వైపు బిగ్ బాస్ ఫైనల్ ఈవెంట్ కూడా ఉండటంతో చాలా మంది ఆ రెండింటి మీదనే ఆసక్తి చూపించారు. మహానుభావుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన బాహుబలి ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చిన కూడా సినిమాకి ప్రమోషన్ తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ ఇమేజ్ ఉంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ప్రభాస్ ఫ్రెండ్స్ కావడం, అలాగే హీరో కూడా ప్రభాస్ ఫ్రెండ్ కావడం సినిమాని కాస్తా ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో యంగ్ రెబల్ స్టార్ రంగంలోకి దిగాడు. ఫంక్షన్ భాగానే జరిగిన, ప్రమోషన్ మాత్రం దొరకలేదు అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. మరి రెండు పెద్ద సినిమాల వేవ్ ని తట్టుకొని మహానుభావుడు ఎలా నిలబడతాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments