యంగ్ రెబెల్ స్టార్ “ప్రభాస్” తర్వాతి ప్రాజెక్ట్..!?

Thursday, September 6th, 2018, 12:37:17 PM IST

“ప్రభాస్’ ఈ పేరు ఇప్పుడు భారత సినీ పరిశ్రమలో పరిచయం అక్కరలేని పేరు. బాహుబలి చిత్రంతో ఒక్క సారిగా భారతీయ సినీ ప్రేక్షకులు అందరికి “డార్లింగ్’ అయ్యిపోయాడు మన డార్లింగ్ యంగ్ రెబెల్ స్టార్ “ప్రభాస్”. యూత్ లో అత్యంత క్రేజ్ ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒక్కరు. ప్రస్తుతం ప్రభాస్ “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వం లో “సాహో” చిత్రం లో నటిస్తున్నారు. ఐతే ప్రస్తుతం అందిన తాజా వార్త ప్రకారం. సాహో చిత్రం సెట్స్ పై ఉండగానే తన తర్వాతి చిత్రాన్ని మొదలు పెడుతున్నట్టు వెల్లడి చేశారు.

ఈ చిత్రం 2020 లో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు ఈ చిత్రాన్ని “జిల్” చిత్రానికి దర్శకత్వం వహించిన కె.కె రాధాకృష్ణ దర్శకునిగా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం లో హీరోయిన్ గా పూజ హెగ్డేని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి పలు హిందీ చిత్రాలకి ప్రస్తుతం “సైరా” చిత్రానికి స్వరాలను అందిస్తున్న అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక అయినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో 20 వ చిత్రం కావడం తో అంచనాలు భారీ గానే ఉన్నాయి..

  •  
  •  
  •  
  •  

Comments