ప‌్ర‌భాస్‌కు చెడ్డ పేరు తెస్తున్న బిగ్‌బాస్‌ గాళ్‌!

Thursday, March 22nd, 2018, 09:28:28 PM IST

`బిగ్‌బాస్‌` లేటెస్ట్ సీజ‌న్‌లో ఆర్షిఖాన్ పేరు మార్మోగిపోయిన సంగ‌తి విదిత‌మే. వివాదాల‌తో ఈ అమ్మ‌డు బోలెడంత ప్ర‌చారం కొట్టేసింది. హౌస్‌లో సాటి పార్టిసిపెంట్స్‌తో గొడ‌వ‌లు ప‌డుతూ నానా ర‌చ్చ చేసింది అమ్మ‌డు. ఏదో ఒక ర‌కంగా త‌న‌కు కావాల్సిన ప్ర‌చారం లాక్కుంది. అప్ప‌టివ‌ర‌కూ అనామ‌కంగానే ఉన్న త‌న‌కు తాజాగా బాలీవుడ్‌లో అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. ఆ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డు భూమి బ‌ద్ధ‌ల‌య్యే, సౌత్ గుండెల్లో రాయి ప‌డే షాకింగ్‌ విష‌యం ఒక‌టి లీక్ చేసింది.

బాహుబ‌లి హీరో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇప్ప‌టికే నిర్మాత‌ల‌తో చ‌ర్చ‌లు పూర్త‌య్యాయని బాంబ్ పేల్చింది. కాంట్రాక్టుపై ఇంకా సంత‌కం చేయ‌లేదు కానీ, ఇప్ప‌టికీ ట‌చ్‌లోనే ఉన్నా. మూడు నాలుగు సార్లు వారితో మాట్లాడాన‌ని అర్షీఖాన్ చెప్పుకుంది. అయితే ఇదంతా వ‌ట్టి డ‌మ్మాల్ డుమ్మీల్‌! అంటూ ప్ర‌త్య‌ర్థులు అంతే నెగెటివ్ ప్ర‌చారం చేశారు. సొంత బాకా కొంత మానుకో! అంటూ కొంద‌రు చీవాట్లు వేశారు. అయితే తాను చెప్పిన దాంట్లో అవాస్త‌వ‌మేమీ లేదని, సౌత్‌లో న‌టించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పింది. అలానే ప్ర‌భాస్‌తో సినిమా ఆఫ‌ర్ ఇప్ప‌టికీ త‌న ఖాతాలో ఉంద‌ని క్లారిటీనిచ్చే ప్ర‌య‌త్నం చేసింది. మొత్తానికి ప్ర‌భాస్ అంటూ త‌న పేరును మాత్రం వాడేస్తోంద‌ని అంద‌రికీ అర్థ‌మైంది. ఇక‌పోతే ఒక‌వేళ ఆర్షి చెప్పిన‌ట్టు త‌న‌కు ప్ర‌భాస్ ఛాన్స్ ఇచ్చి ఉంటే, అది ఏ సినిమాలో అన్న చ‌ర్చ అభిమానుల్లో సాగుతోంది. `సాహో`లోనా? లేక త‌దుప‌రి సినిమాలోనా? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. మొత్తానికి బ్యాడ్ గాళ్ అలా ప్ర‌భాస్ పేరు చెడ‌గొడుతోంద‌ని అనుకోవ‌చ్చేమో! వేరొక స్పోర్ట్స్ ఈవెంట్‌లో ఆర్షీఖాన్‌, రాకీసావంత్‌ల ర‌చ్చ ప్ర‌ధానంగా చ‌ర్చ‌కొచ్చింది.