అన్నిటికి కారణం రాజమౌళి : ప్రభాస్

Saturday, April 28th, 2018, 04:23:46 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రతిష్టను ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. సాధారణంగా బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు సౌత్ లో వర్కౌట్ కావు అనే టాక్ ఉన్న సమయంలో భారీ సినిమాను తెరకెక్కించి ఒక టాలీవుడ్ పేరు మీదే సినిమాను విడుదల చేశారు. అంత పెద్ద కథను అవసరం అయితే బాలీవుడ్ లో చేయవచ్చు కానీ జక్కన్న అలా చేయలేదు. తెలుగు హీరోను పెట్టి బాలీవుడ్ బిజినెస్ కి ఫొటోగా దించాడు. బాహుబలి రెండు భాగాలు చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నాయి.

ఆ సినిమా ద్వారా అందరి చూపు టాలీవుడ్ పై పడింది. ప్రభాస్ రేంజ్ కూడా పెరిగింది. బాలీవుడ్ 2 విడుదలైన నేటికీ ఏడాది కావొస్తోంది. ఈ సందర్బంగా ప్రభాస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా అందించిన విజయం నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టి, ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు బొమ్మ ఏర్పాటవ్వడానికి కారమయ్యింది. అలాంటి గొప్ప ‘బాహుబలి’ నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనదే. నాకు ఇంతటి గుర్తింపును కీర్తి ప్రతిష్ఠలకు ముఖ్య కరమైన దర్శకుడు రాజమౌళి గారికీ .. సహకరించిన మిత్రులకు నా ప్రత్యేక కృతజ్ఞతలని ప్రభాస్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments