ఆ రూమర్స్ లో నిజం లేదు.. క్లోజ్ గానే ఉన్నాం: ప్రభాస్

Wednesday, May 23rd, 2018, 06:56:23 PM IST

బాహుబలి సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అయినా తరువాత నార్త్ జనాల ద్రుష్టి టాలీవుడ్ పై పడింది. ముఖ్యంగా అక్కడి సెలబ్రెటీలు కూడా సినిమా గురించి మాట్లాడుకోవడం సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఎక్కువగా ప్రభాస్ కి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలానే పెరిగింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. బాహుబలిని బాలీవుడ్ లో రిలీజ్ చేసిన కరణ్ జోహార్ కి అలాగే హీరో ప్రభాస్ కి మధ్య గత కొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎందుకంటే కరణ్ జోహార్ బాలీవుడ్ లో ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేసుకున్నాడని ఆ కథ నచ్చకపోవడంతో కరణ్ రెబల్ స్టార్ కు విలన్ గా మారాడు అని బాలీవుడ్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. అయితే విషయం తెలుసుకున్న ప్రభాస్ వెంటనే కౌంటర్ ఇచ్చాడు. దుబాయ్ లో రీసెంట్ గా సాహో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరణ్ జోహార్ గారికి తనకు ఎలాంటి వివాదాలు రాలేవు. వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఎవరు నమ్మవద్దని ప్రభాస్ రూమర్స్ కి చెక్ పెట్టాడు. అయితే రూమర్స్ గురించి కరణ్ తనకు ఫోన్ చేసి మరి చెప్పారని ప్రభాస్ వివరించాడు.

  •  
  •  
  •  
  •  

Comments