ఇంటర్నేషనల్ మీడియాను ఫోకస్ చేసిన ప్రభాస్ ?

Thursday, May 3rd, 2018, 10:38:33 AM IST

బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లోని అబుదాబి లో జరుగుతుంది. అరవై రోజుల షూటింగ్ కోసం 90 కోట్లవరకు ఖర్చు పెడుతున్నారట. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ స్టంట్ మెన్ కెన్నీ బెట్స్ నేతృత్వంలో ఈ యాక్షన్ సన్నివేశాలు జరుగుతున్నాయి. అయితే షూటింగ్ గ్యాప్ లో ఇంటర్నేషనల్ మీడియాతో చర్చలు జరుపుతున్నాడు ప్రభాస్. తాజాగా అక్కడి ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు . ఈ ఇంటర్వ్యూ తో ప్రభాస్ క్రేజ్ మరింత ఫోకస్ కానుంది. మొత్తానికి సాహో సినిమాతో ప్రభాస్ ఫోకస్ ఇంటర్నేషనల్ రేంజ్ కి మారిందని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Comments