ఆర్మీ ఫీట్‌ : ప్ర‌భాస్‌కి అరుదైన గౌర‌వం?

Friday, December 1st, 2017, 02:12:07 PM IST

దేశ స‌రిహ‌ద్దుల్లో అత్యంత సంక్లిష్ట‌త‌ల్ని ఎదుర్కొంటూ ప్రాణాల‌కు తెగించి పోరాటం చేస్తుంటారు మ‌న జ‌వాన్‌లు. అదంతా దేశాన్ని. మ‌న‌ల్ని కాపాడేందుకు సాగే పోరాటం. అలాంటి జ‌వాన్‌లు అమ‌రులైతే క‌నీసం గుర్తు చేసుకోవాల్సిన బాధ్య‌త అయినా మ‌న‌కు లేదంటారా? అందుకే అప్పుడ‌ప్పుడు వీర జ‌వాన్‌ల సంస్మ‌ర‌ణ కోసం సెల‌బ్రిటీ షోస్ నిర్వ‌హిస్తున్నారు. ఈసారి `వ‌న్ ఫ‌ర్ ఆల్‌- ఆల్ ఫ‌ర్ వ‌న్‌` పేరుతో ముంబైలో ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. న‌టి, పార్లమెంట్ సభ్యురాలుహేమమాలిని, దర్శకుడు మధూర్ భండార్కర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్య‌క్ర‌మ‌మిది.

ఇందులో బాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీస్ స‌హా ప‌లు ప‌రిశ్ర‌మ‌ల నుంచి ప‌లువురు హీరోల్ని ఆహ్వానించారు. టాలీవుడ్ నుంచి ఆ పిలుపు అందుకున్న ఏకైక హీరోగా డార్లింగ్ ప్ర‌భాస్ పేరు మార్మోగిపోతోంది. `గేట్ వే ఆఫ్ ఇండియా`లో జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి ఓ ప్ర‌త్యేక అతిధిగా బాహుబ‌లుడు హాజ‌ర‌వుతున్నాడు. ఇది అరుదైన గౌర‌వం. త‌న‌కి మాత్ర‌మే ద‌క్కిన గ్రేట్ ఛాన్స్‌. ఈ కార్య‌క్ర‌మానికి అధ‌ర్వా ఫౌండేష‌న్ స్పాన్స‌ర్ చేస్తోంది. ఇక వీరజవానుల త్యాగాలకు సంబంధించిన వాస్తవ సంఘటనతో.. 10 ల‌ఘు చిత్రాల్ని దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ప్ర‌దర్శింప‌జేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భాస్ వాయిస్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో ల‌ఘు చిత్రాల‌కు ఉప‌యోగిస్తార‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments