సూర్య సినిమాలో ప్రభాస్ ?

Wednesday, September 28th, 2016, 06:04:55 PM IST

surya-prabhass
ఏంటి సూర్య హీరోగా నటిస్తున్న ”సింగం 3” సినిమాలో ప్రభాస్ కనిపిస్తాడట నిజమేనా ? అంటూ .. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది? ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ మరో సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఆ సినిమాకు ఖచ్చితంగా భారీ హైప్ క్రియేట్ కావడం మాములే. ఇక తమిళ హీరో సూర్య సినిమాలో ప్రభాస్ కనిపిస్తుండడం ఇప్పుడు అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న ”సింగం 3” సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనుష్క, శృతి హాసన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట, ఈ విషయం గురించి ప్రభాస్ తో సూర్య మాట్లాడితే ప్రభాస్ ఓకే చెప్పినట్టు తెలిసింది. ”బాహుబలి” తో ప్రభాస్ తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు, కాబట్టి ”సింగం 3” లో ప్రభాస్ ను చుస్తే వారికీ కూడా షాకే !! అయితే ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments