డార్లింగ్ బ్యాంకాక్ విమాన‌మెక్కాడు!

Sunday, April 15th, 2018, 12:03:32 AM IST


డార్లింగ్ ప్ర‌భాస్ కొంత‌కాలంగా సాహో చిత్రీక‌ర‌ణ‌తో బిజీబిజీగా ఉన్నాడు. క్ష‌ణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్స్‌లో త‌ల‌మున‌క‌లుగా ఉన్నాడు. అయితే ఇంత బిజీలోనూ అత‌డికి మూడు రోజుల పాటు రిలీప్ దొరికిందిట‌. ఆ క్ర‌మంలోనే అత‌డు బ్యాంకాక్ నుంచి సైలెంటుగా హైద‌రాబాద్‌లో దిగిపోయాడు. ఆ మూడ్రోజులు డార్లింగ్ ఏం చేశాడో తెలుసా? జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ త‌ల్లి గుడి వెన‌క త‌న ఇంట్లో హాయిగా రిలాక్స‌య్యాడ‌ట‌.

ఆ క్ర‌మంలోనే త‌మిళ హీరో, బ్రూస్‌లీ విల‌న్ అరుణ్ విజ‌య్ న‌టించిన `క్రైమ్ 30` ట్రైల‌ర్‌ని లాంచ్ చేశాడు. ఇక ఈ లాంచింగ్ వేళ ప్ర‌భాస్ లుక్ చూసిన వారంతా స్ట‌న్న‌యిపోయారంటే న‌మ్మండి. 16 ఏళ్ల కెరీర్‌లో ఇంత స్మార్ట్‌గా ఇదివ‌ర‌కెన్న‌డూ లేడ‌ని అంత‌కంత‌కు టీనేజీ బోయ్‌లా స్మార్ట్ అయిపోతున్నాడ‌ని ఫ్యాన్స్ ముచ్చ‌టించుకున్నారు. ఆ క్ష‌ణం ఫ్యాన్స్‌తో ప్ర‌భాస్‌ ఫోటోలు దిగుతూ బిజీగా గ‌డిపారు. ఇక‌పోతే ఇలాంటి లుక్ కోసం అమెరికాలో నెల‌రోజుల పాటు స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ చేయించుకున్నాడ‌న్న ప్ర‌చారం ఇదివ‌ర‌కూ ఉంది. ఇక ఈపాటికే మూడు రోజుల సెల‌వు దినాల్ని పూర్తి చేసుకుని, ప్ర‌భాస్ నేటి రాత్రికి బ్యాంకాక్ షూటింగుకి ప‌య‌నం అయ్యాడ‌ని చెబుతున్నారు. ఒక‌సారి బ‌రిలో దిగాక మ‌ళ్లీ డార్లింగ్ కాస్తా ఫుల్ బిజీ అయిపోతాడ‌న్న‌మాట‌!

  •  
  •  
  •  
  •  

Comments