భాగమతి కోసం .. బాహుబలి వస్తున్నాడు ?

Saturday, January 20th, 2018, 03:58:18 PM IST

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి చిత్రం ఈ నెల 26 న విడుదలకు సిద్ధం అయింది. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుష్క కెరీర్ లో నిలిచిపోయేలా భాగమతి చిత్రం ఉందంటూ ప్రశంశలు వస్తున్నాయి. ఇక ఈ నెల 21న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు బాహుబలి ఫేమ్ ప్రభాస్ ముఖ్య అతిధిగా పాల్గొంటాడట. అనుష్క తో ప్రభాస్ కు ఉన్న స్నేహం నేపథ్యంలో ప్రభాస్ ఈ వేడుకలో పాల్గొంటున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.