షాకింగ్ : ప్ర‌భాస్ దొంగా పోలీస్ ఆట‌?

Saturday, January 20th, 2018, 01:37:18 AM IST

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన బాహుబ‌లి సిరీస్ ఎంత‌టి విజ‌యం సాధించిందో తెలిసిందే. అంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించాక‌.. త‌దుప‌రి స్టెప్ అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఉండాలని త‌ల‌చిన ప్ర‌భాస్‌.. ఆ క్ర‌మంలోనే భారీ యాక్ష‌న్ చిత్రం `సాహో`లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో ఇండియాలోనే బెంచ్ మార్క్ హీరోగా త‌న‌ని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాల‌న్న‌ది ప్లాన్‌. అందుకు త‌గ్గ‌ట్టే రిచ్ లొకేష‌న్ల‌లో.. ఎవ‌రూ ఊహించ‌ని సూప‌ర్ ప‌వ‌ర్ యాక్ట్‌తో మైమ‌రిపించాల‌ని ఎంతో క‌ల‌లు కంటున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే చిత్రీక‌ర‌ణ అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా సాగుతోంది. సుజిత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిసింది. సీన్స్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా వ‌స్తున్నాయిట‌. ఇందులో ప్ర‌భాస్ రోల్ చూస్తుంటే రోమాలు నిక్క‌బొడుచుకోవ‌డం గ్యారెంటీ అని చెబుతున్నారు. అదంతా స‌రే.. అస‌లు ఈ చిత్రంలో ప్ర‌భాస్ చేస్తున్న పాత్ర ఏంటి? అంటే దానికి ఇన్నాళ్లు స‌రైన స‌మాచారం లేనేలేదు. ఏదో కాప్ స్టోరి అంటూ చెప్పుకున్నా.. ప్ర‌భాస్ పోలీస్‌గా న‌టిస్తున్నాడ‌ని అధికారికంగా ధృవీక‌రించిందే లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ దొంగాట ఆడే పోలీస్‌గా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది. అంటే దొంగ‌త‌నాలు చేసే పోలీస్ అన్న‌మాట‌! ప్ర‌భాస్ చెడ్డ పోలీస్‌నా? మ‌ంచి పోలీసా? అన్న‌ది తెలియాలంటే తెర‌పై చూడాల్సిందేన‌ని అంటున్నారు. ఠ‌ఫ్ కాప్‌లోని ఆ కొత్త కోణం రివీల్ చేసే ట్విస్టులు ఆక‌ట్టుకుంటాయిట‌. అలాగే ప్ర‌భాస్‌కి ధీటుగా యాక్ష‌న్ క్వీన్‌గా శ్ర‌ద్ధా కపూర్ క‌నిపించ‌నుంద‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ -శ్ర‌ద్ధా జోడీ న‌ట‌న `టైగ‌ర్ జిందా హై`లో స‌ల్మాన్ -క‌త్రిన‌ల ఫీట్ల‌ను త‌ల‌పిస్తుందిట‌. ఇదంతా చూస్తుంటే సాహో చిత్రంతో ప్ర‌భాస్ మ‌రో మైలురాయిని అందుకోవ‌డం గ్యారెంటీ అని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాని వ‌చ్చే సంక్రాంతికి కానీ రిలీజ్ చేసే ఆస్కారం లేద‌ని, భారీ వీఎఫ్ఎక్స్ కోసం ఆ స‌మ‌యం ప‌డుతుంద‌ని చెబుతున్నారు.