జులై నుండి తెరపైకి ప్రభాస్ కొత్త సినిమా ?

Thursday, April 26th, 2018, 10:57:31 AM IST

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే సాహో సినిమాలో నటిస్తున్న అయన ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాటు మరో సినిమా చేయడానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. జిల్ సినిమాతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న రాధాకృష్ణ తో ఈ సినిమా చేయనున్నాడు. రెండు సినిమాల విడుదల విషయంలో ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకనే ఈ ప్రభాస్ నెక్స్ట్ సినిమాను జులై 7న మొదలు పెట్టనున్నారు. ఈ చిత్రాన్ని రెబెల్ స్టార్ కృష్ణం రాజు నిర్మిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కే ఈ సినిమా తరువాత ప్రభాస్ హిందీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments