జులై నుండి ప్రభాస్ నెక్స్ట్ సినిమా ?

Thursday, March 15th, 2018, 12:03:26 AM IST

బాహుబలి తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉండడంతో ఈ లోగా మరో సినిమా చేసి ఫాన్స్ ను ఖుషి చేయాలనీ ప్లాన్ చేసాడు ప్రభాస్. బాహుబలి విషయంలో ఐదేళ్లు టైం పట్టింది దాంతో ప్రభాస్ ఫాన్స్ చాలా గుస్సా అయ్యారు. ఇప్పుడు సాహో విషయంలో కూడా ఎక్కువ టైం పట్టేలా ఉండడంతో మరో సినిమాకు ఓకే చెప్పాడు ప్రభాస్. జిల్ ఫేమ్ రాధా కృష్ణ తో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం అటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తీ కావొచ్చాయి. ఈ సినిమాను జులై లో మొదలు పెట్టి వీలయినంత త్వరగా పూర్తీ చేయాలనీ ప్లాన్ చేశారట.