ప్రభాస్ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ?

Monday, October 8th, 2018, 01:27:14 PM IST

బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటి వరకు 70 శతం పైగా షూటింగ్ పూర్తీ చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ మారో సినిమాకే ఓకే చెప్పాడు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ తో తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అయితే ఈ సినిమాకోసం ఓ ఆసక్తికర టైటిల్ ని పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ ఆసక్తికర టైటిల్ ఏమిటో తెలుసా . … ఆమూర్ !! ఆమూరా .. అంటే అని షాక్ అవ్వకండి .. ఆమూర్ అంటే ఫ్రెంచ్ భాషలో ప్రేమ అని అర్థం !! ఈ సినిమా అచ్చమైన ప్రేమ కథగా తెరకెక్కతుంది .. అదికూడా 1980 నేపథ్యంలో కావడం విశేషం. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని ఎంపిక చేసారు. త్వలోనే షూటింగ్ పూర్తీ చేసి వచ్చే దసరాకు విడుదల చేస్తారట.