సాహో కోసం భారీ రిష్కి షాట్స్ చేస్తున్న ప్రభాస్ ?

Saturday, April 21st, 2018, 04:20:45 PM IST

ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సాహో. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్ లోని పలు ఖరీదైన ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అబుదాబి లో జరిగే షూటింగ్ లో చేజ్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. హాలీవుడ్ టెక్నీషియాన్స్ స్టంట్ మాస్టర్ కేని బెట్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నా ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ రిష్కి షాట్ లను కూడా చేస్తున్నాడట. ఈ ఫైట్స్ సినిమాకే హైలెట్ అవుతాయని యూనిట్ భావిస్తుంది. బాలీవుడ్ భామలు శ్రద్ధ కపూర్, ఎవ్లీన్ శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివరి వరకు జరుగుతుందట. ఆ తరువాత షెడ్యూల్ ని హైద్రాబాద్ లో జరపనున్నారు. వచ్చే దసరాకు విడుదల ప్లాన్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments