దుబాయ్ లో ముగించేసిన సాహో

Saturday, May 26th, 2018, 05:53:12 PM IST

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రం మేజర్ షెడ్యూల్ ని ఈ రోజుతో దుబాయ్ లో పూర్తీ చేసుకుంది. దాదాపు యాభై రోజుల పాటు జరిగిన ఈ మేజర్ షెడ్యూల్ దుబాయ్ లోని అబుదాబి లో జరిగింది. ఈ షెడ్యూల్ లో హాలీవుడ్ స్టంట్ మెన్ నేతృత్వంలో కీలక యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు. దాదాపు ఈ ఒక్క షెడ్యూల్ కోసమే ఏకంగా 90 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం. భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఖరీదైన ట్రక్కులు, లారీలు, కార్లను వినియోగించారు. నేటితో షెడ్యూల్ పూర్తవడంతో టీమ్ ఎల్లుండి ఇండియా రానున్నారు. ఆ తరువాత మరి షెడ్యూల్ ని వచ్చే నెల 5 నుండి రామోజీ ఫిలిం సిటీ లో జరపనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే షూటింగ్ పూర్తీ చేసి చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల ఆలోచనలో ఉన్నారు. ఇక మరో వైపు ప్రభాస్ కూడా జిల్ రాధా కృష్ణ తో మరో సినిమాను జూన్ లోనే మొదలు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments