నెక్స్ట్ షెడ్యూల్ కోసం ముంబై కి సాహో టీమ్?

Sunday, September 23rd, 2018, 12:19:05 PM IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఫిలిం సిటీ లో షూటింగ్ పూర్తీ చేసుకుంది. అయితే తదుపరి షెడ్యూల్ కోసం టీమ్ ముంబై వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో మార్పులు చేయాలనీ ప్రభాస్ సూచించాడట దాంతో దర్శకుడు ఆ మార్పులు చేసే పనిలో ఉన్నాడు. మార్చే అంశాలు ఫైనల్ అయ్యాకే ముంబై కి ఈ టీమ్ వెళ్లనుంది. అయితే నెక్స్ట్ షెడ్యూల్ విషయంలో ఇంకాస్త టైం పట్టేలా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 70 శతం పైగా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ముంబై తో పాటు హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్స్ తో పూర్తవుతుంది. వచ్చే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ తెచ్చుకున్న నేపథ్యంలో ఇప్పుడు తెరకెక్కుతున్న సాహో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం అప్పుడే బిజినెస్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది.