హైదరాబాద్లో సాహో మొదలుపెట్టాడుగా ?

Wednesday, July 11th, 2018, 11:01:59 PM IST


బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ ఈ రోజు నుండి హైదరాబాద్ లో మొదలైంది. మొన్నటి వరకు దుబాయ్ లోని ప్రముఖ లొకేషన్స్ లో దాదాపు దాదాపు రెండు నెలలపాటు షూటింగ్ జరిపారు. అక్కడే 90 కోట్ల భారీ బడ్జెట్ తో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా మూడో షెడ్యూల్ ఈ రోజు నుండి హైదరాబాద్ లో మొదలైంది. ప్రస్తుతం ఫిలిం సిటీ లో ప్రారంభం అయినా ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్స్, కీలక నటీనటులు పాల్గొనగా కీలక సన్నివేశాలు తీసారట. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ జిల్ రాధా కృష్ణ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రం ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానుంది. దాంతో పాటు ప్రభాస్ ఓ హిందీ సినిమా కూడా ఈ ఏడాది చివరిలో చేస్తాడట. ఇక సాహో సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నది.

  •  
  •  
  •  
  •  

Comments