ఇప్పట్లో సాహో రావడం.. డౌటేనా ?

Friday, May 4th, 2018, 11:13:41 AM IST

మీరు విన్నది నిజమే .. బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్నా విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఈ ఒక్క ఫైట్ కోసమే ఏకంగా 90 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నరాట. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో వస్తుందని అంటున్నారు .. కానీ సినిమా యాభై శాతం కూడా పూర్తీ కాలేదు .. అలాగే మధ్యలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు ప్రభాస్. ఆ సినిమా కోసం ఈ నెల చివర్లో టైం కేటాయించాడు. అలాగే సాహో సినిమా పూర్తయ్యేందుకు మరో ఆరునెలలు పెట్టె అవకాశం ఉందని .. అప్పుడు కూడా పూర్తవుతుందన్న నమ్మకం లేదని టాక్ ? మొత్తానికి 2019 సమ్మర్ లోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రభాస్ ఫాన్స్ కు ఈ ఏడాది కూడా నిరాశ తప్పదేమో !!

  •  
  •  
  •  
  •  

Comments