అబుదాబిలో .. ప్రభాస్ సాహో !!

Saturday, March 31st, 2018, 11:50:12 PM IST


ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం షూటింగ్ మొత్తానికి దుబాయ్ లోని అబుదాబిలో షూటింగ్ జరుపుకుంటుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్నాయి. ఈ సినిమాలో మేజర్ షెడ్యూల్ ని ముందే దుబాయ్ లోని అబుదాబి లో ప్లాన్ చేసారు .. కానీ అక్కడ అనుకున్న సమయానికి పర్మిషన్ రాలేదు .. దాంతో మిగతా సన్నివేశాలు హైద్రాబాద్ లో తీశారు. ఒక సమయంలో అబుదాబి కి సంబందించిన సెట్ కూడా వేయాలని ప్లాంక్ చేసారు. కానీ బడ్జెట్ తడిసి మోపెడవుతుందని భావించి .. పర్మిషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్ అని ఆగారు. తాజాగా పర్మిషన్ రావడంతో తాజాగా షూటింగ్ కోసం యూనిట్ బయలుదేరి వెళ్ళింది. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ అక్కడ జరగనుంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బెట్స్ కంపోస్ చేసే సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారని తెలిసింది. ఈ సినిమాను దసరాకు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.