మొత్తానికి .. ప్రభాస్ వేగం పెంచాడు ?

Sunday, February 4th, 2018, 12:29:10 PM IST

ఈ మధ్య ప్రభాస్ విషయంలో అయన ఫాన్స్ కాస్త గుస్సా మీదున్నారు. కారణం .. బాహుబలి కోసం ఏకంగా ఐదేళ్లు టైం కేటాయించిన ప్రభాస్ .. ఇప్పుడు సాహో కోసం రెండేళ్లు టైం తీసుకున్నాడు. సాహో సినిమా త్వరలో విడుదల అవుతుందా అంటే దానికి ఇంకా చాల టైం పట్టేలా ఉంది .. అందుకే ప్రభాస్ కొత్త ప్లాన్ వర్కవుట్ చేస్తున్నాడు. సాహో తరువాత జిల్ రాధా కృష్ణ తో ఓ సినిమాకు ఓకే చెప్పిన ప్రభాస్ ఈ చిత్రాన్ని స్పీడ్ గా షూటింగ్ చేసి మూడు నెలల్లో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. అందుకే వచ్చే నెలలో ఈ షూటింగ్ మొదలు పెట్టి .. జూన్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా వస్తే కనీసం ఫాన్స్ ని సంతృప్తి పెట్టొచ్చని ప్రభాస్ ఆలోచన.