ప్ర‌భాస్ ఎంత పెద్ద ప్లాన్ వేశాడో?

Sunday, September 9th, 2018, 01:25:24 PM IST

పాప్ ప్ర‌పంచంలో బ్ర‌యాన్ ఆడ‌మ్ స్థానం ఏంటో తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత‌డికి వీరాభిమానులున్నారు. అత‌డు వేదిక‌నెక్కి పాట పాడితే చుట్టూ జ‌నం ఉర్రూత‌లూగాల్సిందే. పాప్ గాయ‌కుడిగా సుదీర్ఘ‌మైన అనుభ‌వం ఉన్న సింగ‌ర్ అత‌డు. అందుకే బ్ర‌యాన్ ఇండియా టూర్ అంత‌కంత‌కు హీట్ పెంచుతోంది. ఈ టూర్‌లో భాగంగానే అత‌డు హైద‌రాబాద్‌లోనూ అడుగుపెట్ట‌నున్నాడు.

ఒక‌వేళ ఇక్క‌డికి వ‌స్తే అత‌డికి ఎవ‌రు ఆతిధ్యం ఇస్తారు? అంటే రాజాధిరాజు ప్ర‌భాస్ రాజు ఆ ఏర్పాట్లు చూసుకుంటార‌ని తెలిసింది. డార్లింగ్ చొర‌వ ఏ ఇత‌ర హీరోల‌తో పోల్చినా వేరేగా ఉంటుంది. అత‌డు ఆతిధ్యం ఇస్తే, రాజుల ఆతిధ్యం ఎలా ఉంటుందో తెలిసిన‌వారు చెబుతారు. బ్ర‌యాన్‌కి అలాంటి దిమ్మ‌తిరిగే పార్టీ ఎరేంజ్ చేయ‌బోతున్నాడు. ఇక‌పోతే బ్ర‌యాన్ హైద‌రాబాద్ ట్రిప్‌లో అత‌డితో ప్ర‌భాస్ ఏం మాట్లాడ‌బోతున్నాడు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఒక అభిమాని గానే ఇలా చేస్తున్నాడా? లేక త‌న సినిమా సాహోని విదేశాల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసే ప్లాన్‌లోనే ఇలా అంత‌ర్జాతీయంగా పాపుల‌రైన స్టార్ల‌ను ఉప‌యోగిస్తున్నాడా? అంటూ ఒక‌టే వేడెక్కించే చ‌ర్చ సాగుతోంది. డార్లింగ్ ఏం చేసినా అది మ‌న మంచికే కాబ‌ట్టి కీప్ సైలెన్స్‌!!

  •  
  •  
  •  
  •  

Comments