సాహో సినిమాకు బ్రేక్ ఇస్తున్న ప్రభాస్ ?

Friday, April 27th, 2018, 10:06:36 AM IST

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. అయితే ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. దానికి కారణం అయన జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు ఒప్పుకోవడమే. ఈ సినిమా జులై లో మొదలు కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకోసం ఓ వర్క్ షాప్ ని నిర్వహిస్తున్నారట. ఈ వర్క్ షాప్ లో ప్రభాస్ తో పాటు హీరోయిన్ పూజ హెగ్డే కూడా పాల్గొంటుందని తెలిసింది. ముంబై లో ఈ వర్క్ షాప్ ని నిర్వహిస్తున్నారని, దాదాపు పది రోజుల పాటు ఈ వర్క్ షాప్ జరగనుందట. 1980 ల నాటి కాలంలో జరిగిన ప్రేమ కథతో ఈ సినిమా ఉంటుందని. గత జన్మల నేపథ్యంలో తెరకెక్కనుందట. అంటే రెండు జన్మల ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ మధ్య టాలీవుడ్ లో 1980 నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రంగస్థలం సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో ఈ ట్రెండ్ సినిమాలకు మెచ్చి ఊపొచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments