లవర్ బాయ్ కోసం బరువు తగ్గే పనిలో ప్రభాస్ ?

Tuesday, September 4th, 2018, 07:39:54 PM IST

బాహుబలి కోసం భారీగా తన బాడీ ని పెంచేసి .. బాహుబలిగా తనదైన సత్తా చాటాడు ప్రభాస్. ప్రస్తుతం అయన నటిస్తున్న సాహో సినిమా కూడా యాక్షన్ నేపథ్యం కాబట్టి .. దానికోసం కాస్త బరువు తగ్గి ఈ సినిమా చేస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ దశలోనే ప్రభాస్ మరో సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తో ఈ సినిమా తెరకెక్కనుంది . అయితే ఇది పక్కా లవ్ స్టోరీ గా ఉంటుందని సమాచారం. మరి లవ్ స్టోరీ అంటే .. హీరో లవర్ బాయ్ గా కనిపించాలి అందుకే .. ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా 10 కిలోల బరువు తగ్గే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తాడని అంటున్నాయి యూనిట్ వర్గాలు. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని ఇప్పటికే ఈ పాత్ర కోసం రకుల్, రాశి ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరు ఎంపికవుతారు అన్నాడు తెలియాల్సి ఉంది. మొత్తానికి లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రభాస్ బాగానే కష్టపడుతున్నాడట.

  •  
  •  
  •  
  •  

Comments