సాహో కంటే ముందే ప్రభాస్ మరో సినిమా!

Monday, February 12th, 2018, 09:24:05 PM IST

బాహుబలి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న స్టార్ హీరో ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇయర్ వస్తుంది అనుకున్న సాహో సినిమా అస్సలు వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే సినిమా చిత్రీకరణ ఇంకా చాలా భాగమే మిగిలి ఉంది. దీంతో ప్రభాస్ సాహో కంటే ముందే ఒక సినిమాను ఫినిష్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. అందుకు తగ్గట్లు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడట. జిల్ దర్శకుడు రాధా కృష్ణ గత ఏడాది చెప్పిన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రభాస్ కి చాలా నచ్చింది. ఆ సినిమా ఫినిష్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదట. కేవలం ఆరు నెలల్లో ఫినిష్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రభాస్ వీలైనంత త్వరగా ఆ సినిమాను ఫినిష్ చేసి ఇదే ఏడాది రిలీజ్ అయ్యేలా చెయ్యాలని డిసైడ్ అయినట్లు సమాచారం. కృష్ణం రాజు హోమ్ ప్రొడక్షన్ లో ఆ సినిమా ఉంటుందని టాక్.