టీజర్ : ఈ సినిమాలో మాటలుండవ్.. భయమొక్కటే !

Wednesday, March 7th, 2018, 10:47:03 PM IST

గత కొంత కాలంగా హర్రర్ సినిమాలు జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. భయం కాన్సెప్ట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో ఓ సరికొత్త హర్రర్ కథ బయపెట్టబోతోంది. అందులో ప్రభుదేవా కనిపించడం మెయిన్ పాయింట్. పిజ్జా వంటి సక్సెస్ ఫుల్ కథను తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజన్ దర్శకత్వంలో మెర్క్యూరి అనే సినిమా రూపొందుతోంది. సినిమాకు సంబందించిన టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

కొన్నేళ్ల క్రితం మెర్క్యూరి ఎక్కువ కకలిసిన నీరు తాగడం వల్ల ఒక ఊరంతా స్మశానంగా మారుతుంది. అందరు చచ్చిపోతారు. అయితే ఆ ప్రాంతంలో టూర్ నిమిత్తం కొంత మంది అడుగుపెడతారు. మాట్లాడితే ప్రభుదేవా దెయ్యం వచ్చి చంపేస్తుంది. దీంతో అందరు మాట్లాడడానికి భయపడుతుంటారు. అదే కాన్సెప్ట్. అంటే సినిమాల్లో మాటలు ఉండవు. అంతా సైలెన్స్. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సినిమా నడుస్తుంది. అందుకోసం మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ చాలానే కష్టపడుతున్నాడట. వచ్చే నెల 13న భాషలతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.