చిరంజీవే బెస్ట్ అంటున్న ప్ర‌భుదేవా

Monday, September 26th, 2016, 11:50:56 PM IST

prabhu-deva
ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్‌గా పేరు తెచ్చుకొన్నాడు ప్ర‌భుదేవా. సినిమా పాట‌ల రూపు రేఖ‌ల్నే మార్చిన ఘ‌నత ఆయ‌న‌కి ద‌క్కుతుంది. సౌత్‌తోపాటు, బాలీవుడ్‌కీ వెళ్లొచ్చారు. వేలాది పాట‌ల స్టెప్పులు స‌మ‌కూర్చారు. అలాంటి కొరియోగ్ర‌ఫ‌ర్‌ని మీ దృష్టిలో ఏ హీరోమంచి డ్యాన్స‌ర్ అని అడిగితే ట‌క్కున చిరంజీవి అని చెప్పేస్తాడు. “ఇదివ‌ర‌కు కొంత‌మందే స్టెప్పులు బాగా వేసేవాళ్లు. ఇప్పుడంతా ఇర‌గ్గొడుతున్నారు. కానీ నాకు న‌చ్చే డ్యాన్స‌ర్ మాత్రం అప్ప‌టికీ, ఇప్ప‌టికీ చిరంజీవిగారే. ఆయ‌న ఓ స్టెప్పేస్తే చాలు, అందులో నుంచి ఓ ప్ర‌త్యేక‌మైన రిథ‌మ్ వ‌స్తుంది“
అన్నాడు. ప్రభుదేవాలాంటి మాస్ట‌ర్ నుంచి ఆ ప్ర‌శంస రావ‌డ‌మంటే ఆషామాషీ కాదు. మ‌రి చిరు రీ ఎంట్రీలోనూ అదే స్టెప్పుల‌తో అద‌ర‌గొడ‌తాడో లేదో చూడాలి. అయితే చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150కి కొరియోగ్ర‌ఫీ చేసే అవ‌కాశం మాత్రం ఇంకా ప్ర‌భుదేవాకి రాలేద‌ట‌. ఒక‌వేళ చిరు పిలిస్తే కొన్ని పాట‌ల‌కైనా కొరియోగ్ర‌ఫీ చేస్తా అని చెప్పాడు ప్ర‌భుదేవా. త్వ‌ర‌లోనే ఆయ‌న అభినేత్రి చిత్రంతో సంద‌డి చేయ‌బోతున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments