నా తండ్రికి ఘోర అవమానం..ముఖ్యమంత్రే కారణం అన్న నటుడు..!

Thursday, September 28th, 2017, 10:35:26 PM IST

తెలుగు చిత్రాల్లో ఎన్టీఆర్ రారాజుగా వెలుగొందుతున్న సమయంలో తమిళంలో శివాజీ గణేషన్ రాణించేవారు. తమిళ సినీ అభిమానులకు ఆయన ఆరాధ్య నటుడు. డార్లింగ్ చిత్రంలో ప్రభాస్ కు తండ్రిగా నటించిన ప్రభు ఆయన కుమారుడే అన్న విషయం తెలిసిందే. కాగా తన తండ్రికి ఘోర అవమానం జరిగిందని ప్రభు సంచనల వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. నా తండ్రి స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జయలలిత లక్ష్యంగా పెట్టుకున్నారు. జయ కూడా సినిమా రంగం నుంచే రావడంతో ఆమె ఈ కార్యక్రమాన్ని చేయాలని భావించారు. ఈ ప్రతిపాదనపై ఇప్పటి ముఖ్యమంత్రి పళని స్వామి కీలక పాత్ర పోషించారు.

కానీ ఆయన వలనే తాజాగా తన తండ్రికి అవమానం జరిగిందని ప్రభు వాపోతున్నాడు. ఇన్నాళ్లకు చెన్నై లోని అడయార్ లో శివాజీ గణేశన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాన్ని ఇద్దరి మంత్రుల ద్వారా తూతూ మంత్రంగా ముగించారని ప్రభు అంటున్నాడు. కనీసం ముఖ్యమంత్రి కూడా హాజరు కాకపోవడం తన తండ్రిని అవమానానికి గురిచేయడమే అని ప్రభు వ్యాఖ్యానించాడు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం 24 న శివాజీ గణేశన్ జయంతి సందర్భంగా ముగిసింది. తాజగా ఈ విషయం పై ప్రభు ప్రభుత్వానికి లేఖ రాసారు.

  •  
  •  
  •  
  •  

Comments