టాప్ స్టోరి : ప్ర‌భుదేవా ది గ్రేట్‌

Tuesday, April 3rd, 2018, 08:52:15 PM IST

ప్ర‌భుదేవా ది గ్రేట్‌! అత‌డు ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్ర‌తిరూపం. సౌతిండియాలోనే మేటి ప్ర‌తిభావంతుడిగా … అసాధార‌ణ ప్ర‌తిభ‌కు చిరునామాగా అత‌డు వెలిగిపోతున్నాడు. సినీవినీలాకాశంలో అత‌డు అత్యుత్త‌మ స్థాయిని అందుకున్నాడు. ఇంకా ఇంకా ఆకాశం ఎత్తు ఎదిగేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తూనే ఉన్నాడు. ఓవైపు క‌థానాయ‌కుడిగా న‌టిస్తూనే, మ‌రోవైపు ద‌ర్శ‌కుడిగా డ్యూయెల్ గేమ్ ఆడ‌డంలో అలుపెరుగ‌ని శ్రామికుడిగా అలా సాగుతూనే ఉన్నాడు. 45 అందుకుని, 50కి చేరువ‌వుతున్నా ఇంకా అదే స్పీడు. 20 ప్ల‌స్ యువ‌కుడిలా అదే జోష్ చూపించ‌డం ప్ర‌భుదేవాకే చెల్లింది.

ప్ర‌స్తుతం స‌ల్మాన్ `ద‌బాంగ్ 3` చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నాడు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్నారు. ఇటీవ‌లే మోస్ట్ అవైటెడ్ మూవీ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` లో రెండు పాట‌ల‌కు కొరియోగ్రాఫ్ చేశాడు. అమితాబ్, అమీర్‌ అంత‌టి మేటి క‌థానాయ‌కుల‌కు ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫ్ చేసే అదృష్టం త‌న‌కు మాత్ర‌మే ద‌క్కింద‌ని మురిసిపోతున్నాడు. హీరోగా న‌టించిన మూకీ చిత్రం `మెర్క్యురి` రిలీజ్ ముందే ప‌లు అంత‌ర్జాతీయ సినిమా ఉత్స‌వాల‌కు వెళుతోంది. ఇదంతా ప్ర‌భుదేవా ఛ‌రిష్మాటిక్ స‌క్సెస్‌. ది గ్రేట్ ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్‌.. ల‌వ‌బుల్ షో మ్యాన్‌.. ప్ర‌భుదేవాకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. అంతేకాదు ప్ర‌భుదేవా నేడు ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న‌కు `రామాయ‌ణం` తీయాల‌నుంద‌ని ప్ర‌క‌టించ‌డం హాట్ టాపిక్‌.