కరోనా తో ప్రాణాలను కోల్పోయిన ప్రదీప్ మాచిరాజు తండ్రి!

Sunday, May 2nd, 2021, 12:34:49 PM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మహమ్మారి భారిన పడి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే తాజాగా ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండురంగ మాచిరాజు శనివారం రాత్రి కరోనా వైరస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఈ విషయం గురించి తెలియడం తో పలువురు ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రదీప్ అభిమానులు తమ విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయం సినీ పరిశ్రమ లో వైరల్ గా మారింది. ప్రదీప్ బుల్లి తెరపై యాంకర్ గా మాత్రమే కాకుండా, వెండితెర పై నటుడు గా కూడా తన సత్తా చాటుతున్నాడు. పలు సందర్భాల్లో తన తల్లిదండ్రుల తన ఎదుగుదల కోసం ఎంతో సపోర్ట చేశారు అని తెలిపారు. అయితే ప్రదీప్ వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.