దర్శకేంద్రుడి సినిమాల్లో హీరోయిన్లకు చుక్కలే..ఇదే నిదర్శనం..!

Tuesday, November 22nd, 2016, 10:40:21 PM IST

prajna-jaswal
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిత్రాల్లో హీరోయిన్లను ఎంత అందంగా చూపిస్తారో అదే రేంజ్ లో కష్టపెడతారు కూడా. రాఘవేంద్ర రావు సినిమాలంటే పళ్లతో హీరోయిన్లను తెగ ఇబ్బంది పెట్టడం ఖాయం. ఆయన చిత్రాల్లో పూలు, పళ్లు ఖచ్చితంగా ఉంటాయి.ప్రస్తుతం ఈ దర్శకేంద్రుడు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రదారుడిగా ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం లో నాగార్జున తోపాటు అనుష్క, ప్రగ్యా జైస్వాల్ లు ప్రధాన పాత్రలని పోషిస్తున్నారు.

ఈ చిత్రం లో ప్రగ్య జైస్వాల్ ని దర్శకేంద్రడు అందంగా చూపించబోతున్నాడంట.ప్రగ్యాజైశ్వాల్ కోసం ప్రత్యేకంగా బంగారు వర్ణపు గౌను ని తయారు చేయించాడు. దానిబరువు తెలిస్తే ఆశ్చర్య పోవలసిందే.ఏకంగా 14 కేజీల బరువుండే గౌనుని డిజైన్ చేయించాడు. దానితో నృత్యం చేయడానికి ప్రగ్య జైస్వాల్ నానా తంటాలు పడిందట.చూడగానే ఆకర్షించేలా ఉన్న ఆ గౌను లోఉన్న ప్రగ్య లుక్ ని విడుదల చేశారు.