కంచె హీరోయిన్ బికినీ స్టీల్ లో హీటెక్కిస్తోందిగా

Tuesday, December 5th, 2017, 10:37:37 AM IST

కంచె సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ ఈ మధ్య గ్లామర్ షోలతో ఎక్కువగా దర్శనం ఇస్తోంది. కానీ అమ్మడికి విజయాలు మాత్రం అంతగా దక్కడం లేదు. వరుసగా అపజయాలను ఎదుర్కొంటూనే ఉంది. నక్షత్రం – జయ జానికి నాయక సినిమాల్లో హాట్ గా కనిపించినా కూడా ఏ మాత్రం అవకాశాలు అందుకోలేదు. ప్రస్తుతం మంచు విష్ణుతో ఆచారి అమెరికా యాత్ర అనే ఒక్క సినిమాను చేస్తోంది. ఆ సినిమా ఎంతవరకు విజయం అందుకుంటుందో గాని ప్రస్తుతం ప్రగ్యా తన గ్లామర్ ఫొటోస్ తో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫోటో షూట్ లో ప్రగ్యా బికినీ అందాలతో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఎవరి స్టైల్ లో వారు అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments