రామాయణాన్ని తీయాలని ఉందంటున్న ప్రభుదేవా ?

Wednesday, April 4th, 2018, 10:58:11 AM IST

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా క్రేజ్ తెచ్చుకున్న నటుడు, దర్శకుడు ప్రభుదేవా తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను చెన్నై లో తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. తాజగా అయన హిందీలో ఓ హిందీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్బంగా ప్రభుదేవా స్పందిస్తూ తనకు రామాయణాన్ని సినిమాగా తీయాలని .. అదికూడా హాలీవుడ్ లో వచ్చిన లార్డ్ అఫ్ ది రింగ్స్ తరహాలో తీయాలని చెప్పాడు. అయితే ఆ సినిమాకు బడ్జెట్ కూడా 500 కోట్లకు పైగానే అవుతుందని చెప్పాడు. పైగా ఆ సినిమా తీయాలంటే కచ్చితంగా ఐదేళ్లు అవుతుందని పేర్కొన్నాడు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు రామాయణం తెరకెక్కిస్తానని చెప్పాడు. తనకు డాన్స్, సినిమాలు తప్ప మరో ప్రపంచం తెలియదని అన్నాడు ప్రభుదేవా. ఇప్పటికే రామాయణాన్ని సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు అల్లు అరవింద్ తో పాటు మరో ఇద్దరు నిర్మాతలు కలిసి మొదలు పెట్టారు.

  •  
  •  
  •  
  •  

Comments