దిల్ రాజుకు భారీ డిస్కౌంట్ ఇచ్చిన క్రేజీ నటుడు ?

Thursday, July 26th, 2018, 09:41:01 PM IST


సక్సెస్ ఫుల్ నిర్మాతగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దిల్ రాజు బ్యానర్ లో నటించాలని నటీనటులు కోరుకోవడం సహజమే .. అయితే అయన బ్యానర్ లో ఛాన్స్ వస్తే చాలు ఫ్రీ గా చేయాలనీ అనుకుంటారు .. అలాంటిది ఈ క్రేజీ నటుడు మాత్రం ఏకంగా భారీ డిస్కౌంట్ ఇచ్చేసాడు. అయన ఎవరో కాదు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ అంటే సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ అందరికి తెలుసు .. అలాంటిది అయన దిల్ రాజు కోసం భారీ డిస్కాంత్ ఇచ్చాడట. అయితే ఇది ఆయనకు అవకాశాలు లేక కాదండోయ్ .. దిల్ రాజు తో ఉన్న అనుబంధం నేపథ్యంలోనే అయన ఈ డిస్కౌంట్ ఇచ్చాడట. నిజానికి ప్రకాష్ రాజ్ రోజుకు 5 లక్షల వరకు వసూలు చేస్తాడు .. అలాంటిది అయన తాజాగా నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం సినిమాకోసం కేవలం 3 లక్షలే తీసుకున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. అంటే రోజుకు రెండు లక్షలు త్యాగం చేసాడన్నమాట. నితిన్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తీ చేసుకుంది. వచ్చే నెల 9న విడుదల చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments