జస్ట్ ఆస్కింగ్ అంటూ వాక్సిన్ ధర పై ప్రకాష్ రాజ్ సూటి ప్రశ్న

Thursday, April 22nd, 2021, 09:33:56 AM IST

దేశం లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అటు మరణాల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యం లో వాక్సిన్ ను అందరికీ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఈ మేరకు వాక్సిన్ ధరల విషయం లో అనుసరిస్తున్న వైఖరి పట్ల అటు కేంద్రం పై, ప్రతి పక్ష పార్టీ నేతలు వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మహ్వా మోయిత్ర వాక్సిన్ ధర పట్ల స్పందించారు. ఒక రాష్ట్రానికి పౌరుడి గా ఉండి ఇండియా కి పౌరుడి గా లేకుండా ఎవరైనా ఉన్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే అందుకు వివరణ ఇచ్చారు. వాక్సిన్ ధర కేంద్రానికి 150 రూపాయలు గా ఉండగా, అదే వాక్సిన్ రాష్ట్రానికి 400 రూపాయలు ఎందుకు అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే కేంద్ర ప్రభుత్వం వైఖరి పై తరచూ ఘాటు వ్యాఖ్యలు చేసే ప్రముఖ నటుడు, నేత ప్రకాశ్ రాజ్ దీని పై స్పందించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ వాక్సిన్ ధర పట్ల ప్రశ్న రేకెత్తించారు. అయితే దీని పట్ల ఇప్పటికే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీని పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.