బిగ్ న్యూస్ : జగన్ నిర్ణయాలపై వైరల్ అవుతున్న ప్రకాష్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్.!

Thursday, February 27th, 2020, 07:04:12 AM IST

ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ తీసుకున్నటువంటి పలు నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంటే మరోపక్క మరికొన్ని నిర్ణయాల పట్ల ఇప్పటికే చాలా వ్యతిరేక వచ్చింది.అయితే వాటిని ఏవీ పట్టించుకోకుండా జగన్ ఇప్పుడు తనదైన శైలిలో దూఆకుపోతున్నారు.అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తాను తీసుకున్న విప్లవాత్మక మార్పుల నిర్ణయాలలో రాజధాని మార్పు అంశం కానీ అలాగే ఇంగ్లీష్ మీడియం బోధన వంటివి కలకలం రేపాయి.

అయితే ఈ సంచలనం రేపినటువంటి నిర్ణయాలపై ప్రముఖ సినీ నటుడు మరియు రాజకీయ వేత్త ప్రకాష్ రాజ్ చేసిన పలు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తానూ ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నానని కానీ నన్ను పర్సనల్ గా అడిగితే తెలుగు భాషే చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని ఇంగ్లీష్ మీడియం పెట్టొచ్చు కానీ బోధనా విధానం అయితే ఖచ్చితంగా తెలుగులో ఉండాలి అని తెలుగులో ఓ ప్రత్యేకత ఉంటుందని తెలిపారు.

ఇక అలాగే రాజధాని మార్పుపై కాదు కానీ మూడు రాజధానులు అంశంపై కొన్ని కీలకమైన కామెంట్స్ చేసారు.మూడు రాజధానులు అనేది కక్షపూరితమా లేక ఇన్వెస్టిమెంట్లు కోసమా అన్నది పక్కన పెడితే ప్రత్యేకంగా నన్ను అడిగితే నాకు మూడు రాజధానులు అంశం నచ్చలేదు అని అలాగే తాను ఈ మధ్య విశాఖపట్నం వెళ్లినపుడు కూడా అక్కడ వాళ్ళని కొంతమందిని అడగ్గా వారికి విశాఖ రాజధాని అవుతుందని అంత ఎక్సయిట్ మెంట్ లేదు సార్ అని నాతో అన్నారని ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా షేర్ అవుతున్నాయి.