తాజ్ మహల్ ను ఎపుడు కూల్చేస్తారో చెప్పండి : ప్రకాష్ రాజ్

Tuesday, October 24th, 2017, 12:03:48 PM IST

తన నటనతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఈ మధ్యా వార్తల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై ఆయన మోడీపై వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యపరచింది. కానీ ఇతర బీజేపీ నాయకులు కూడా ప్రకాష్ రాజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ కూడా ఆ కామెంట్స్ కి తనదైన శైలిలో కౌంటర్ వేశారు.

రాజకీయాల్లోకి రావాలనుకుంటే తాను డైరెక్ట్ గా వస్తాను కానీ ఈ విధంగా వ్యాఖ్యలు చేసి రానని చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ట్వీట్ చాలా వైరల్ అవుతోంది. గత కొంత కాలంగా తాజ్ మహల్ పై కొన్ని వివాదాస్పద కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలుపెట్టారు, తాజ్ మహల్ ని ఎప్పుడు కూల్చేస్తారో చెబితే తన పిల్లలకు చివరిసారిగా తాజ్ మహల్ ని చూపిస్తానని ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ చాలా వైరల్ అవుతోంది. అంతే కాకుండా నేషనల్ మీడియాలో కూడా ఈ ప్రకాష్ రాజ్ ట్వీట్ పై అనేక కథనాలు వెలువడుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments