చెప్పుతో కొడతానని చెప్పా..అలా అంటే: సింగర్ ప్రణవి

Tuesday, October 17th, 2017, 04:22:32 PM IST

తన మధురమైన సన్నని గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలను పాడిన సింగర్ ప్రణవి. డ్యాన్స్ మాస్టర్ రఘును పెళ్లి చేసుకొని ప్రస్తుతం హ్యాపీగా తన మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. అయితే రీసెంట్ ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎవరు ఊహించని విధమైన సమాధానాలను చెప్పింది. అంతే కాకుండా తానకు ఎదురైనా కొన్ని చేదు అనుభవాలను గురించి కూడా ప్రణవి తెలిపింది.

తాను ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక సినిమాకు పాట పాడటానికి వెళితే.. సినిమాకు సంబందించిన వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. అంతే కాకుండా సినిమాల్లో నువ్వు పాటలు పాడాలంటే తనతో ఉండాలంటూ కామెంట్స్ చేయడంతో చెప్పు తీసుకొని కొడతానని అక్కడే కౌంటర్ ఇచ్చేశానని ప్రణవి వివరించింది. అంతే కాకుండా ఆ విధంగా వచ్చే అవకాశాలు తనకు ఏమి అవసరం లేదని వెనక్కి తీరిగి వచ్చేశానని చెబుతూ.. తన ముందు ఎవరైనా ఆడవాళ్లని ఏమైనా అంటే వాళ్లను కొట్టేస్తానని చెప్పింది. దీంతో నెటిజన్స్ ప్రణవి పట్ల చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. డేరింగ్ గర్ల్ అని కూడా అనేక బిరుదులు ఇచ్చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments