చాలాకాలానికి బాపు బొమ్మ ఇలా

Saturday, September 8th, 2018, 10:58:39 PM IST

చాలా కాలం త‌ర్వాత బాపు బొమ్మ‌ ప్ర‌ణీత ఇలా సామాజిక మాధ్య‌మంలో ద‌ర్శ‌న‌మిచ్చింది. త‌న‌దైన శైలిలో తీక్ష‌ణ‌మైన‌ చూపుల‌తో యువ‌త‌కు గాలం వేస్తోంది. అత్తారింటికి దారేది చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నా ఎందుక‌నో ఈ భామ ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా పెద్ద స్థాయికి ఎద‌గ‌లేక‌పోయింది. ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ లాంటి ప్ర‌ముఖులు ఈ అమ్మ‌డి కెరీర్ కోసం చేసిందేం లేదు. ఆ క్ర‌మంలోనే ప్ర‌ణీత కేవ‌లం మోడ‌లింగ్ రంగానికే అంకిత‌మైంది. రిబ్బ‌ను క‌టింగులు, షాపుల ఓపెనింగుల‌తోనే ఆదాయ ఆర్జ‌న చేస్తోంది.

ప్ర‌స్తుతం ప్ర‌ణీత కేవ‌లం క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మైంది. తెలుగు, త‌మిళ్‌లో అవ‌కాశాలిచ్చేవాళ్లుంటే న‌టించేందుకు సిద్ధ‌మే. అయితే న‌వ‌త‌రం నాయిక‌ల కాంపిటీష‌న్‌తో ఆ ఒక్క ఛాన్స్ తిరిగి రావ‌డం అంత సులువేం కాదు. చూద్దాం.. ఈ అమ్మ‌డు కెరీర్ ప‌రంగా ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుందో?

  •  
  •  
  •  
  •  

Comments