అందుకే సినిమాలు చేయడంలేదంటున్న ప్రణీత ?

Friday, May 11th, 2018, 10:34:51 AM IST

అందాల భామగా ఇమేజ్ తెచ్చుకున్న ప్రణీత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించింది. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలతో క్రేజీ మీదున్న ఈ అమ్మడికి ఆ తరువాత చేసిన సినిమాలు వరుస పరాజయాలు అందుకోవడంతో అవకాశాలు తగ్గాయి. దాంతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తమిళంలో రెండు, కన్నడంలో రెండు సినిమాలు చేసిన ఈ అమ్మడు తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదని అడిగితె ఏమందో తెలుసా .. తెలుగులో సినిమాలు చేయడానికి కారణం మంచి కథలు రాకపోవడమేనట. మంచి కథలు వస్తేనే సినిమాలు చేస్తానని ఏది పడితే అది చేయనని చెప్పింది. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చిందని చెప్పిన ఈ భామకు తెలుగులో రామ్ సరసన హలొ గురు ప్రేమకోసమేరా జీవితం అనే సినిమాలో నటిస్తుంది. ఈ పాత్ర తన మనసుకు దగ్గరగా ఉందని చెప్పింది. గ్లామర్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి మరిన్ని తెలుగు అవకాశాలు రావాలని కోరుకుందాం.