బ్రేకింగ్ న్యూస్ : టీడీపీ తరుపున ప్రశాంత్ కిషోర్ ప్రచారం అప్పుడేనా

Sunday, June 16th, 2019, 11:17:25 AM IST

గత రెండు మూడు రోజుల నుండి, నేషనల్ మీడియాలో కూడా బాగా సంచలనమైన వార్త ఏమిటంటే ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికల సమయానికి టీడీపీకి సపోర్ట్ గా పనిచేయటానికి చంద్రబాబు తో డీల్ సెట్ చేసుకోబోతున్నాడనే న్యూస్ ప్రకంపనలు సృష్టించింది. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పనిచేసిన పీకే టీమ్, జగన్ సీఎం అయ్యి ఒక నెల కూడా కాకుండానే, అప్పుడే అతనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నదా అనే విషయం తెలిసిన దగ్గర నుండి ప్రతి వైసీపీ అభిమాని ఆందోళన చెందుతున్నారు. ఇక తెలుగుదేశం శ్రేణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించినట్లే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ విషయం అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో టీడీపీలోని కొందరు నాయకులు అదేమీ లేదంటూ, దాని తీవ్రతని తగ్గించే పనిచేస్తున్నారు కానీ, నిజానికి లోపాయికారి ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది.

గతంలో జగన్ ఆఫర్ చేసిన దానికంటే కొంచం ఎక్కువ మొత్తంలోనే చంద్రబాబు పీకే టీమ్ కి ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీ కోసం ప్రచారం చేయటానికి పీకే బృందం 2022 చివరికి లేదా, 2023 మొదటిలో రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కనీసం ఎన్నికలకి సిద్ధం కావటానికి ఏడాదిన్నర సమయం అవసరమని భావించినట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా మరి కొద్దీ నెలల్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే పీకే టీమ్ కి, తెలుగుదేశం పార్టీకి మధ్య నారా లోకేష్ సమన్వయం కర్తగా ఉంటూ, పార్టీ తరుపున పీకే టీమ్ కి సలహాలు ఇవ్వటానికి సిద్ధం ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ గమనిస్తే 2024 ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అర్ధం అవుతుంది.