బిగ్ బ్రేకింగ్ : జగన్ కు షాకిచ్చే విధంగా..ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం..?

Friday, June 14th, 2019, 11:32:45 PM IST

ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటివంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సాధించిన అఖండ విజయం వెనుక మరో వ్యక్తి హస్తం కూడా ఉందని చెప్పి తీరాలి.అతడే ప్రశాంత్ కిషోర్.ఎక్కడో బీహార్ కు చెందిన ఈ వ్యక్తిని జగన్ ఏరి కోరి తన సలహాదారునిగా భారీ మొత్తంలో ఒప్పందం చేసుకొని నియమించుకున్నారు.ఒక రకంగా జగన్ కు ఇంత అశేష ప్రజాధారణ తీసుకువచ్చిన ఎన్నో నిర్ణయాల వెనుక ప్రశాంత్ కిషోర్ మరియు అతని టీమ్ కష్టం కూడా ఉంది.జగన్ ను ఎప్పుడు ప్రజల్లో ఉంచేలా చెయ్యడం సోషల్ మీడియాలో ప్రచారాలు ఇలా ఎన్నెన్నో ప్రశాంత్ కిషోర్ వల్ల జగన్ కు లాభదాయకంగా చేకూరాయి.

ఎన్నికల అనంతరం కూడా ప్రశాంత్ కిషోర్ అతని టీమ్ కు జగనే ఏపీ కి కాబోయే ముఖ్యమంత్రి అని కూడా ప్రకటన చేసారు.2019 ఎన్నికల్లో జగన్ ను గెలుపుకు అత్యంత దగ్గర చేసిన ప్రశాంత్ కిషోర్ రాబోయే 2024 ఎన్నికల్లో అదే గెలుపు నుంచి దూరం చేయబోతున్నారట.ప్రశాంత్ కిషోర్ కు రాజకీయ వ్యూహకర్తగా ఎంతటి పేరుందో అందరికీ తెలుసు.అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారట.

ఇప్పటికే చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను కలిసి కొన్నేళ్లు కాంట్రాక్టు కూడా కుదుర్చుకున్నారట.2019లో జగన్ గెలుపు కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ మరియు అతని ఐప్యాక్ టీమ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పని చెయ్యడానికి సిద్ధ పడ్డారు.అని జాతీయ మీడియా సంస్థ అయినటువంటి “సిఎన్ ఎన్ న్యూస్ 18” జర్నలిస్ట్ అయినటువంటి రిషిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు.అయితే దీనిపై అధికారికంగా ఏ ప్రకటన ఇంకా రాలేదు కానీ ఇప్పుడు ఈ వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.ఇది నిజంగా జగన్ కు వెన్నుపోటే అని చెప్పాలని ఈ వార్త తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.