బిగ్ బ్రేకింగ్ : జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వేసిన స్కెచ్ మాములుగా లేదుగా!

Sunday, August 18th, 2019, 01:13:36 PM IST

ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధినేత అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకోడానికి గల అనేక కారణాల్లో దేశంలోనే పేరొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రధాన కారణం అని జగనే ప్రస్తావించారు.జగన్ ఎప్పుడైతే తన రాజకీయ వ్యూహకర్తగా మరియు సలహాదారునిగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారో అప్పుడే జగన్ ముఖ్యమంత్రి అయ్యిపోయారని వైసీపీ శ్రేణులు భావించారు.

ప్రశాంత్ కిషోర్ మరియు అతని ఐప్యాక్ బృందం జగన్ గెలుపుకు ఎంత కృషి చేసారో అందరికి తెలిసిందే.అయితే జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ మరియు వారి ఐప్యాక్ బృందం అందిస్తున్న సేవలు ఇంకా ముగిసిపోలేదట.ప్రస్తుతం జగన్ కోసం వారు ఇంకా పని చేస్తున్నట్టు అంతర్గత సమాచారం.అంతేకాకుండా ఈ ఒక్కసారి మాత్రమే కాదు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జగనే మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే దిశగా వీరి ప్రణాళికలు వేస్తున్నారని తెలుస్తుంది.మొత్తానికి జగన్ విషయంలో ప్రశాంత్ కిషోర్ గట్టిగానే ప్లాన్ వేశారని చెప్పాలి.