గర్భవతి అయిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రైళ్లో నుండి తోసేసాడు

Thursday, December 29th, 2016, 03:27:04 PM IST

girl2
కోలకతా లోని మాల్డా రైల్వే స్టేషన్ లో ఒక దారుణం జరిగింది. ఒక వ్యక్తి గర్భవతి అయిన తన ప్రియురాలిని రైలు నుండి తోసేశాడు. రైల్వే, పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కతిహార్ ఎక్స్ ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం మాల్డా నుండు సంసీ స్టేషన్ కు వెళ్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారికి ఒక మహిళ ఆర్తనాదాలు వినిపించాయి. ఈ కేకలు విన్న రైల్వే పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా ఒక మహిళ రైలు పట్టాలపై రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆమెను మాల్డా మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ సంఘటనలో బాధితురాలు తన కుడి చేతిని కోల్పోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు.

ఈ సంఘటనపై బాధితురాలి తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తమ కుమార్తె అహిమ్ మండల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని, ప్రస్తుతం తమ కుమార్తె గర్భవతి అని వాళ్ళు తెలిపారు. వాళ్ళు ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం తమకు తెలిసి తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని కోరగా అతను తిరస్కరించిందని అన్నారు. డిసెంబర్ 16న తాము అతనిపై కేసు పెట్టడంతో పెళ్ళికి ఒప్పుకున్నాడని, కానీ అతనికి తమ కూతురిని చంపే ఉద్దేశం ఉందని అనుకోలేదని వారు వాపోయారు. మంగళవరం అహిమ్ తమ ఇంటికి వచ్చి బయటకు వెళ్దాం రమ్మని తీసుకెళ్లాడని, బయటకు తీసుకెళ్తున్నాడు అనుకున్నాం కానీ ఇలా చంపే ఉద్దేశంతో తీసుకెళ్తున్నాడని తాము ఊహించ లేకపోయామని వారు ఆవేదన చెందారు. తమ కూతురి పరిస్థితికి కఠినంగా శిక్షించాలని వారు కోరారు. అయితే అహిమ్ ను తాము వేరే కేసులో కూడా ప్రస్తుతం వెదుకుతున్నామని, అతడే ఇప్పుడు ఈ కేసులో కూడా నిందితుడని పోలీసులు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments