ప్రీమియర్ షో టాక్ : రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ !

Sunday, January 14th, 2018, 12:56:29 PM IST

సాధారణంగా చిన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ అంతగా ఉండదు. కానీ రాజ్ తరుణ్ లాంటి హీరో చిత్రం అయితే మాత్రం సినిమా చూడడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న చిత్రాలతో రాజ్ తరుణ్ మంచి పేరు సంపాదించాడు. తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో టాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న తాజ్ తరుణ్ మరో కలర్ ఫుల్ మూవీ ద్వారా సంక్రాంతికి సందడి చేయడానికి వచ్చేశాడు. రాజ్ తరుణ్ నటించిన రంగుల రాట్నం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. తన ఇమేజ్ తగ్గట్లుగా రాజ్ తరుణ్ వైవిధ్యం ఉన్న ప్రేమ కథలలో నటిస్తున్నాడు. ఆ కోవకు చెందినదే రంగుల రాట్నం చిత్రం. ఉయ్యాలా జంపాల తరువాత అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో రాజ్ తరుణ్ నటించి మరో చిత్రం ఇది. ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. రాజ్ తరుణ్ నటించిన ఈ ప్రేమ కథ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

రాజ్ తరుణ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో కాబట్టి అతడికి బి, సి సెంటర్స్ లో తగినంత మార్కెట్ లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని అతడి చిత్రాలు మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి చేరువగా ఉంటాయి. రంగుల రాట్నం కూడా అలాంటిదే. ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాల విషయానికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది రాజ్ తరుణ్, కమెడియన్ ప్రియదర్శి మధ్య సాంగ్ సన్నివేశాల గురించి. మొదటి అర్థ భాగంలో వీరిద్దరూ బాగా ఆకట్టుకున్నారు. హీరోయిన్ చిత్ర శుక్ల, రాజ్ తరుణ్ మధ్య సాగె ప్రేమ సన్నివేశాలు బావున్నాయి. ఫస్ట్ హాఫ్ పరవాలేదనిపించే విధంగా ఉంటుంది. ఈ సినిమా సాధారంగానే స్లో గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో మారి సాగదీత ఎక్కువ కావడం మైనస్ గా మారింది. ఎమోషన్, సెంటిమెంట్ చిత్రాలని ఇష్టపడే వారికి ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది. మొత్తంగా పండగ వేళ రాజ్ తరుణ్ ‘ఏ’ సెంటర్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్లు అనిపిస్తోంది.