పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలనా…?

Tuesday, June 11th, 2019, 12:40:31 AM IST

దేశ వ్యాప్తంగా ఎన్నికలు పూర్తిఅయినప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఇప్పటికి కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి… కాగా ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగి, హింసాపూరితమైన వాతావరణం నెలకొన్న సంగతి మనకు తెలిసిందే… అయితే ఇప్పటికి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి… కాగా శనివారం రాష్ట్రంలో జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయినట్టు సమాచారం. ఈ గొడవలకు కూడా కారణం మిరే అని టీఎంసీ, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ లో జరిగిన పరిస్థితులను ఆ రాష్ట్ర గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి ప్రధాని మోడీకి మరియు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి తెలియజేశారు.

అయితే ఈ విషయాలమీద ఒక జాతీయ మీడియా తో మాట్లాడిన త్రిపాఠి బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన గొడవల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ గొడవలు ఇలాగె కొనసాగితే మాత్రం రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని త్రిపాఠి తెలిపారు. కాగా ఈ అంశం పై మాట్లాడిన బీజేపీ నేత కైలాశ్‌ విజయ్‌వార్గియా ‘ఆ అవసరం రావొచ్చు. అలాంటి డిమాండ్‌ వస్తే కేంద్రం దానిని పరిశీలిస్తుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గురించి ప్రధానితోగానీ, హోంమంత్రితోగానీ నేను చర్చించలేదు’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలు అన్ని కూడా రాష్ట్రంలోని శాంతి భద్రతలు పరిరక్షించేందుకు కృషి చేయాలనీ సూచించారు.