ఆత్మ నిర్భర్ భారత్ కోసం మనందరి సంకల్పం కావాలి – ప్రధాని మోడీ

Saturday, August 15th, 2020, 09:26:02 AM IST

74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఢిల్లీ లో ఘనంగా జరిగాయి. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అయితే ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగం చేశారు. పలు కీలక నిర్ణయాలను, అంశాలను ప్రజలతో పంచుకున్నారు. అయితే ఇందులో ఆత్మ నిర్భర్ భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

స్వాతంత్ర్య సంగ్రామం ప్రేరణ తో నే దేశం ముందుకు సాగుతోంది అని నరేంద్ర మోడీ తెలిపారు. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్దం అయింది అని అన్నారు. అయితే ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో దేశం మొత్తం ఒక్కటై నిలిచింది అని పేర్కొన్నారు. అయితే 25 ఏళ్లు వచ్చిన ప్రతి బిడ్డా కూడా సొంత కాళ్ళ పై నే నిలబడాలని కుటుంబం కోరుకుంటుంది అని, అయితే భారత్ 75 ఏళ్ల తర్వాత కూడా స్వయం సమృద్ది సాధించ లేకపోయింది అని తెలిపారు.

నేటి నుండి, ఈ క్షణం నుండి స్వయం సమృద్ది కి బలమైన సంకల్పం తో ముందుకు వెళ్లాలి అని భారతీయులందరికీ మోడీ పిలుపు ఇచ్చారు.ప్రపంచం ఎపుడూ కూడా పరస్పర ఆధారితం అని, ఏ ఒక్కరూ కూడా ఒంటరిగా ఉండలేరు అని, భారత్ అంటే కేవలం క్రమ శిక్షణ మాత్రమే కాదు, ఉన్నత విలువలతో కూడిన జీవనం అని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రపంచ కళ్యాణానికి మన వంతు కూడా నిరంతరం చేస్తున్నాం అని, ఆత్మ నీర్భర్ భారత్ అనేది నినాదం మాత్రమే కాదు అని, భారత్ కోసం మనందరి సంకల్పం కావాలి అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ యువత ఆత్మ విశ్వాసం తో ఆత్మ నిర్భర్ భారత్ సాధించాలి అని యువతకి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చారు.